డిసెంబరు కల్లా రూ.500 కోట్ల పెట్టుబడులు
హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఫిన్‌టెక్ కంపెనీ ‘అసెట్‌మాంక్’ స్థిరాస్తి మార్కెట్లో పెట్టుబడులు పెంచుతోంది.

అసెట్‌మాంక్
హైదరాబాద్ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ఫిన్‌టెక్ కంపెనీ ‘అసెట్‌మాంక్’ స్థిరాస్తి మార్కెట్లో పెట్టుబడులు పెంచుతోంది. ఈ ఏడాది చివరి నాటికి కమర్షియల్ రియల్ ఎస్టేట్ ఆస్తుల్లో తమ పెట్టుబడులు రూ.500 కోట్లకు చేరుతాయని తెలిపింది. మదుపరుల నుంచి సేకరించే నిధులను ఈ కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లోని కమర్షియల్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పెట్టుబడి పెడుతోంది. ఇప్పటికే ఈ నగరాల్లోని కమర్షియల్ రియల్టీ మార్కెట్లో రూ.120 కోట్ల వరకు పెట్టుబడి పెట్టింది. మదుపరుల నుంచి సేకరించిన నిధులను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం సాయంతో సంప్రదాయ రియల్టీ మార్కెట్లో మదుపు చేస్తున్నట్టు అసెట్‌మంక్ సహ వ్యవస్థాపకులు, సీఓఓ పృధ్వీ చింతా చెప్పారు. త్వరలో పుణె, ముంబై, ఢిల్లీ మార్కెట్లకూ విస్తరించాలని కంపెనీ భావిస్తోందని తెలిపారు.